News July 9, 2024

ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తాం: రేవంత్ రెడ్డి

image

MBNR జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కాకూడదని అన్నారు.

Similar News

News October 1, 2024

NGKL: డీఎస్సీ ఫలితాల్లో రెండు జిల్లాల్లో డిస్ట్రిక్ టాపర్

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన కే. స్వప్న తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. SGT తెలుగులో 84.90 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. అలాగే SGT ఇంగ్లిష్‌లో 87.90 మార్కులు సాధించి హైదరాబాద్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. ఫలితాల్లో స్వప్న సత్తా చాటడంతో సన్నిహితులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే మాత్రమే జన్మించారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.

News October 1, 2024

MBNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, వైన్స్ బంద్ కానున్నాయి. దీంతో MBNR, గద్వాల, NRPT, వనపర్తి, NGKLజిల్లాల ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలంటున్నారు.