News October 15, 2025

ప్రతి పండుగ రెండు రోజులు

image

హిందూ పండగలు తేదీలపై పండితుల తలో మాట కారణంగా రెండు రోజుల పండుగలుగా మారిపోతున్నాయి. సంక్రాంతి మినహాయిస్తే హోళీ, దసరా, దీపావళి పెద్ద పండుగలన్ని నిర్వహించే తేదీలపై డైలమా ఉంటుండడంతో రెండు రోజుల పాటు పండుగలను నిర్వహిస్తున్నారు. దీపావళి క్యాలెండర్లలో 20వ తేదీ ఉండగా, 21న జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే హలీడే జాబితాలో 20వ తేదీ ఉండడం కొసమెరుపు.

Similar News

News October 15, 2025

వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: మంత్రి

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటుకు జిల్లాల వారీగా కలెక్టర్లు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 15, 2025

నారాయణపేట: లేబర్ కార్డులు అందివ్వాలి: CITU

image

నారాయణపేటలో భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు అందించారు. అర్హులైన కార్మికులు తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సీఐటీయూ నాయకులు బాల్‌రామ్, పుంజనూరు ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్డు ఉన్న వారికి పెళ్లి, కాన్పు, మరణం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.

News October 15, 2025

జోగి రమేశ్ అరెస్టుకు రంగం సిద్ధం?

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం తయారీకి ప్రోత్సహించింది రమేశే అని A-1 జనార్దన్ రావు చెప్పడంతో ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మద్యం పట్టుబడిన ANR గోడౌన్ పరిసరాల సీసీ ఫుటేజిని పరిశీలించారు. కాగా జనార్దన్ రావుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని జోగి రమేశ్ స్పష్టం చేశారు.