News August 26, 2025
ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్ తప్పనిసరి: DEO

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని DEO సుబ్రహ్మణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ నందు మంగళవారం పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 39 పీఎం పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్ష ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలన్నారు.
Similar News
News August 26, 2025
HYD బాటలో గురుగ్రామ్.. కుక్కకు ఉద్యోగం

గురుగ్రామ్‌కు చెందిన ‘లీప్‌ఫ్రాగ్’ అనే కంపెనీ ‘చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్’గా గోల్డెన్ రిట్రివర్ శునకాన్ని నియమించుకుంది. ‘ఉద్యోగులు స్ట్రెస్ అవ్వకుండా ఉండేలా తన క్యూట్‌నెస్‌తో ఆనందపరచడమే దీని పని. వారికి ప్రశాంతతను అందిస్తూ పరధ్యానం చెందకుండా ఉండేందుకు ఇది ప్రయత్నిస్తుంది’ అని లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. కాగా గతంలోనే హైదరాబాద్‌లోని ఓ కంపెనీలోనూ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా కుక్కను నియమించింది.
News August 26, 2025
రాజుపాలెం మండలంలో కలెక్టర్ పర్యటన

రాజుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు. ఇందులో భాగంగా తహశీల్దార్, సీడీపీఓ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాన్ని మొత్తం కలియ తిరుగుతూ సిబ్బందితో మాట్లాడారు. రికార్డులను, కార్యాలయ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.
News August 26, 2025
వర్షం కారణంగా కే.కే లైన్‌లో పలు రైళ్లు రద్దు

నిరంతర వర్షాలు, వాతావరణశాఖ రెడ్ అలర్ట్ కారణంగా కేకే లైన్‌లో కొన్ని రైలు సర్వీసులు రద్దు/షార్ట్ టర్మినేషన్ చేయబడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 18515 విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్, 18516 కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్‌ప్రెస్ (26.08.2025) రద్దు. 58501 విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ అరకులో, 58502 కిరండూల్-విశాఖ ప్యాసింజర్ కోరాపుట్‌లో షార్ట్ టెర్మినేట్ అవుతుందని తెలిపారు.