News April 15, 2025
ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి: ఎస్పీ

ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి, సమానత్వం, న్యాయం, విద్యకు హక్కు కోసం ఎంతో కృషి చేశారన్నారు.
Similar News
News November 8, 2025
అశ్వని కురిస్తే అంతా నష్టం

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.
News November 8, 2025
సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News November 8, 2025
సంజాపూర్ హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన జంగయ్య, అతని భార్య అలివేల, కొడుకు రమేష్‌పై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.


