News January 30, 2026

ప్రతి బిడ్డ చదువుకోవాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ‘ప్రతి బిడ్డ చదువుతుంది’ కార్యక్రమంపై గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) చైతన్య జైనీతో కలిసి అన్ని మండల విద్యాధికారులు (MEO), ప్రధానోపాధ్యాయులతో (HM) ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల వయస్సున్న ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

Similar News

News February 13, 2026

ర్యాలీలు, సంబరాలపై నిషేధం: ఖమ్మం సీపీ సునీల్ దత్

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్పష్టం చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా సెక్షన్ 163 BNSS అమలులో ఉన్నందున నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాణసంచా కాల్చడం, డీజేల వినియోగం, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లు తెలిపారు.

News February 13, 2026

ఖమ్మం: భక్తులకు గమనిక

image

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.

News February 12, 2026

ఖమ్మం: మున్సిపల్ కౌంటింగ్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్రాల్లో 100% వెబ్ క్యాస్టింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలన్నారు.