News March 25, 2025
ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి: కలెక్టర్

ప్రతి మండలంలో ఒక మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తెలిపారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో మహిళ, శిశు, దివ్యాంగుల వయేవృద్దుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో ఒక మౌడల్ అంగన్వాడి కేంద్రం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు ఉన్నారు.
Similar News
News November 7, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో డెడ్‌లైన్ ముగియగా ఈనెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం <
News November 7, 2025
పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


