News October 1, 2025
ప్రతి మత్స్యకారునికి లబ్ధి చేకూరాలి: విశాఖ కలెక్టర్

ప్రతి మత్స్యకారునికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం జరిగిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త లబ్ధిదారుల ఆమోదం, బోట్లు, వలల పంపిణీపై చర్చించారు. అనంతరం తిమ్మాపురం మహిళా మత్స్యకార సంఘానికి విశాఖ పోర్టు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన చేపల రవాణా వాహనాన్ని అందజేశారు.
Similar News
News October 2, 2025
విశాఖలో అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల అహ్వానం

విశాఖలో 53 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ICDS పీడీ రామలక్ష్మి తెలిపారు. భీమునిపట్నం జోన్‌లో 11, పెందుర్తిలో 21, విశాఖలో 21 ఖాళీలు ఉన్నాయన్నారు. 7వ తరగతి పాస్ అయి 21-35 ఏళ్ల లోపు గల స్థానిక వివాహితులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్వీకరించనున్నామన్నారు.
News October 2, 2025
విశాఖ: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విశాఖలో భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టర్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102 నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8500834958, బీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి నంబర్ 8074425598 అందుబాటులో తీసుకువచ్చినట్లు బుధవారం వెల్లడించారు.
News October 1, 2025
విశాఖ జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిగా ఉమారాణి

విశాఖ ఇంటర్ బోర్డు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారిణిగా ఉమారాణి నియామకం అయ్యారు. ఇంతవరకు ఈ పదవిలో ఉన్న మజ్జి ఆదినారాయణ పదవీ విరమణ చేయడంతో ఈమెను ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శి నియమించారు. దీంతో బుధవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈమె ఇంతవరకు చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించారు.