News January 8, 2026

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

image

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.

Similar News

News February 20, 2026

ఫోన్‌పేలో బయోమెట్రిక్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

image

రూ.5వేల లోపు ట్రాన్సాక్షన్ల కోసం ఫోన్‌పే <<19185907>>బయోమెట్రిక్<<>> ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫోన్‌పే యాప్‌లో ఎడమ వైపు కార్నర్‌లో ఉండే ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మేనేజ్ పేమెంట్స్‌పై క్లిక్ చేస్తే కింద Biometric Pay కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇందుకోసం ప్లేస్టోర్‌లో యాప్ అప్‌డేట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ iOS యూజర్లకు అందుబాటులో లేదు.

News February 20, 2026

ఇంటి చిట్కాలు

image

* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.
* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్‌ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.

News February 20, 2026

యంగ్ హీరోతో అనుపమ డేటింగ్?

image

అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌లో వీరిద్దరూ సెల్ఫీ తీసుకోగా దాన్ని ధ్రువ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అనుపమ ఆ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించారు. అంతకుముందు ఓ వేడుకలోనూ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడగగా ధ్రువ్‌కి చేస్తా అని అనుపమ చెప్పారు. వీరిద్దరూ గతేడాది ‘బైసన్’ సినిమాలో నటించారు.