News August 29, 2025
ప్రతి రైతుకు యూరియా సమానంగా అందించాలి: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే

ప్రతి రైతుకు యూరియా సమానంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. యూరియా సక్రమంగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా యూరియాను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News August 29, 2025
గద్వాల: సెప్టెంబర్ 1న బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

గద్వాల జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ, నిరసన కార్యక్రమం ఉంటుందని బీజేపీ నేతలు శుక్రవారం పేర్కొన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. జిల్లాలో యూరియా కొరత, వర్షాలతో నష్టపోయిన పంటలు, మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ హాజరవుతారని తెలిపారు.
News August 29, 2025
వనపర్తి కలెక్టరేట్ ముందు కార్మికుల ధర్నా

బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. సీఐటీయూ నేతలు రమేశ్, మండ్ల రాజు మాట్లాడుతూ..కార్మికులపై ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. అన్ని పనులు చేయించుకుని వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.
News August 29, 2025
పార్వతీపురం: అర్హత కలిగి అప్పీల్ చేసిన వారికి పింఛన్ పంపిణీ

దివ్యాంగుల పింఛన్ విచారణకు వచ్చిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో అప్పీల్ చేయవచ్చన్నారు. అర్హత కలిగి అప్పీల్ చేసిన వారికి ఒకటవ తేదీన పింఛను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.