News March 28, 2025
ప్రతి విద్యార్థి వివరాలు పక్కాగా ఉండాలి: మన్యం కలెక్టర్

విద్యా సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. బడి ఈడు పిల్లలు విధిగా పాఠశాలల్లో ఉండాలన్నారు. పిల్లలు బడి బయట ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News February 27, 2026
మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్‌కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్‌లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
News February 27, 2026
పటాన్‌చెరు: UKలో ఉన్న అన్నకు మెసేజ్.. MISSING

పటాన్‌చెరు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి చెందిన నాగఅక్షయ లక్ష్మి (బీఏ ఫైనల్ ఇయర్), రుద్రారం గీతం యూనివర్సిటీలో చదువుతోంది. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తాను బయటకు వెళ్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని యూకేలో ఉన్న సోదరుడికి వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 27, 2026
అల్లూరి: పది విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు రేపే ఆఖరి గడువు

పదో తరగతి విద్యార్థులు నామినల్ రోల్స్ వివరాలు మార్పులకు ఫిబ్రవరి 28తో గడువు ముగుస్తుందని అల్లూరి జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ శుక్రవారం తెలిపారు. విద్యార్థి, పేరెంట్స్ పేర్లులో మార్పులు, కులం, ఉపకులం, ఫోటో, సంతకం మార్చుకునే అవకాశం ఉందన్నారు. హెచ్ ఎం యూ డైస్ ప్లస్ యాప్‌లో లాగిన్ అవ్వాలని సూచించారు. జిల్లాలో 264 ఉన్నత పాఠశాలల్లో 11,457 మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు.


