News November 26, 2025

ప్రతి 10 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస

image

ప్రతి 10 నిమిషాలకు భర్త, కుటుంబ సభ్యుల చేతుల్లో ఒక మహిళ హత్యకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83 వేల మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని చెప్పింది. వీరిలో 60% మంది పార్ట్‌నర్లు లేదా ఫ్యామిలీ మెంబర్ల వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. సగటున రోజుకు 137 మంది మహిళలు కుటుంబసభ్యులు లేదా భాగస్వామి చేతుల్లోనే హత్యకు గురయ్యారని తెలిపింది.

Similar News

News November 26, 2025

వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా!

image

AP: తిరుమలలో <<18389057>>వైకుంఠద్వార<<>> దర్శనాల(DEC 30-JAN 8) కోసం ఈ నెల 27న 10AM నుంచి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. TTD వెబ్‌సైట్, యాప్‌తోపాటు 9552300009 వాట్సాప్ నంబర్‌తోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు హాయ్ లేదా గోవిందా అని మెసేజ్ చేస్తే దర్శనాల ఆప్షన్ కనిపిస్తుంది. DEC 30, 31, JAN 1 తేదీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. డిసెంబర్ 1న 5PM వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న 2PMకు టోకెన్లు కేటాయిస్తారు.

News November 26, 2025

ఖమ్మం: ఈ గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేత

image

ఖమ్మం జిల్లాలో తాజాగా విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఐదు గ్రామ పంచాయతీలను అధికారులు మినహాయించారు. ఏన్కూరు మండలంలోని ఏన్కూరు, ఆరికాయలపాడు, జన్నారం, నాచారం, అలాగే పెనుబల్లి మండలం గౌరారంలో ఎన్నికలను నిలిపివేశారు. ఈ పంచాయతీలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించే విషయంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికలు జరగవు.

News November 26, 2025

నిలబడతారా? తడబడతారా?

image

సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే భారత బ్యాటర్లు శ్రమించకతప్పదు. 549పరుగుల భారీ టార్గెట్‌తో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన IND 27రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. చేతిలో 8వికెట్లున్నా ఒక్కరోజు అదీ చివరి రోజు 522రన్స్ చేయడం దాదాపు అసాధ్యమే. కనీసం డ్రా చేయాలన్నా ఈరోజంతా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 201పరుగులకే చాప చుట్టేసిన మనోళ్లు ఇవాళ ఏం చేస్తారో మరి!