News March 31, 2025
ప్రత్తిపాడుకి చెందిన అన్నదమ్ములను కాపాడిన పోలీసులు

ఎస్.రాయవరం సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగిన అన్నదమ్ములు బాలు, గోపి మునిగిపోతుండగా మెరైన్ పోలీసులు కాపాడారు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన వీరు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో బంధువుల ఇంటికి వచ్చారు. రేవు పోలవరం వెళ్లి సముద్రంలో స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరిని ఏఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్ చిన్నబాబు, హోంగార్డు అప్పలకొండ కాపాడి ఒడ్డుకు చేర్చారు.
Similar News
News March 1, 2026
శ్రీలంక కోచ్ పదవికి జయసూర్య రాజీనామా

తాను శ్రీలంక కోచ్ పదవి నుంచి దిగిపోతున్నట్లు సనత్ జయసూర్య ప్రకటించారు. T20 WCలో శ్రీలంక సూపర్-8లోనే ఇంటిదారి పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త కోచ్ అన్వేషణ మొదలుపెట్టింది. 2024లో జయసూర్య కోచ్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2026 వరకు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ మధ్యలోనే రాజీనామా చేశారు. ఇతడి హయాంలో శ్రీలంక 76 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడగా 36 మ్యాచుల్లో గెలిచింది.
News March 1, 2026
రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.
News March 1, 2026
HYD: నకిలీ ఇన్సూరెన్స్‌లు.. 9 మంది అరెస్ట్

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.


