News October 12, 2025
ప్రత్తిపాడు: ఎక్కడ చదివిందో.. అక్కడే టీచర్‌గా..!

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామానికి చెందిన పండ్రాడ అపర్ణ ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 69వ ర్యాంక్ సాధించారు. తాను చదువుకున్న చింతలూరు ప్రభుత్వ పాఠశాలలోనే పోస్టింగ్ దక్కింది. తాను చదువుకున్న పాత క్లాస్‌రూమ్‌లోనే ఇప్పుడు టీచర్‌గా విధులు నిర్వహించనుంది. దీంతో అపర్ణకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలుపుతున్నారు. ఆమె విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Similar News
News October 12, 2025
దీపావళి బరిలో నాలుగు సినిమాలు

ఈ సారి దీపావళికి బడా హీరోల మూవీలు బరిలో లేవు. దీంతో మీడియం, చిన్న సినిమాలే పోటీ పడుతున్నాయి. తెలుగులో 4 సినిమాలు విడుదల కానున్నాయి. ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్రమండలి’(16), సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసుకదా’(17), ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’(17), కిరణ్ అబ్బవరం నటించిన ‘K-Ramp’(18) బరిలో ఉన్నాయి. ఈ చిత్రాల నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్‌కు మంచి స్పందన వచ్చింది. మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?
News October 12, 2025
బతుకు బండి.. పొంచి ఉన్న ప్రమాదం

ఆస్పరి, దేవనకొండ మండలాల్లో పత్తి సీజన్ ప్రారంభమైంది. పత్తి తీయడానికి రోజూ వందలాది మంది ట్రాక్టర్లు, ఆటోలలో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ లోడింగ్ కారణంగా ఈ ప్రయాణం యమపాశంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం కూలీలను వెంటాడుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, నియంత్రణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
News October 12, 2025
MBNR: మద్యం టెండర్లకు స్పందన కరువు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి మద్యం టెండర్లకు ఆశించిన స్పందన రాలేదు. గతంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే, ఈసారి గడువు సమీపిస్తున్నా వందల్లో కూడా దాటలేదు. 2023లో 8, 128 అప్లికేషన్లు వస్తే, ఇప్పటివరకు కేవలం 278 మాత్రమే అందాయి. దాంతో అధికారులు అప్లికేషన్ల సంఖ్య పెంచేందుకు గతంలో టెండర్లు వేసిన వారికి ఫోన్‌లు చేస్తున్నారు. మద్యం షాపుల టెండర్ ఫీజులను పెంచడమే వెనకడుగు వేసేందుకు కారణంగా తెలుస్తోంది.