News March 18, 2024
ప్రత్యర్థులందరూ కొత్తముఖాలే..!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
Similar News
News February 20, 2026
నెల్లూరు వాసికి కీలక పదవి

నెల్లూరుకు చెందిన ఆడిటర్ ముప్పాల సుబ్బారావుకు కీలక పదవి లభించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సౌత్ రీజినల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. త్వరలో ఆయనకు నెల్లూరులో సన్మానం చేస్తామని అడ్వకేట్ పర్వేజ్ ప్రకటించారు.
News February 20, 2026
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
News February 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


