News March 24, 2024
ప్రత్యర్థులుగా రిటైర్డ్ ఉన్నత ఉద్యోగులు!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ‘కూటమి’ టికెట్‌పై సందిగ్ధత తొలగింది. ముందు TDP నుంచి రాజేశ్‌కు టికెట్ దక్కగా.. అసమ్మతి నేపథ్యంలో ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. విప్పర్తి ఇరిగేషన్ శాఖలో.. గిడ్డి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.
Similar News
News September 27, 2025
రాజమండ్రి: లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

రాజమండ్రిలోని పలు లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం సందర్శించారు. ఆల్కాట్ గార్డెన్, గౌతమీ ఘాట్ వద్ద కొన్ని కుటుంబాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ సూచించారు.
News September 27, 2025
‘ఖాదీ సంత’ విజయవంతానికి బీజేపీ సన్నాహక సమావేశం

గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించనున్న “ఖాదీ సంత” కార్యక్రమంపై బీజేపీ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించింది. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఖాదీ సంత విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలువురు సూచనలు చేశారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు తీర్మానించారు.
News September 27, 2025
GST ప్రయోజనాలపై అవగాహన కల్పించండి: జేసీ

GST సంస్కరణల మేలును క్షేత్రస్థాయి ప్రజలకు చేర్చడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జేసీ, జిల్లా GST నోడల్ అధికారి వై.మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘సూపర్ GST – సూపర్ సేవింగ్స్’ పేరిట నెల రోజులపాటు ఈ ప్రచారాన్ని నిర్వహించాలని వై.మేఘ స్వరూప్ వెల్లడించారు.