News November 11, 2025
ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్

జిల్లాలో పంట నష్టాలను తగ్గించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సిల్వర్ ఓక్‌కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాఫీ తోటలను తెగుళ్ల బెడద నుంచి రక్షించేందుకు అవకాడో, లిచీ, జాక్ ఫ్రూట్, స్వీట్ ఆరంజ్ వంటి విలువైన పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పంటలే లక్ష్యం అన్నారు.
Similar News
News November 11, 2025
HYD: “ఏ బాబు లెవ్”.. ఓటెయ్!

జూబ్లీహిల్స్‌లో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.02 శాతం మాత్రమే నమోదు అయ్యింది. ఓటర్లు ఇకనైనా మేల్కొనాలని SMలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘ఏ బాబు లెవ్.. ఓటెయ్’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సెలవు ఉంటే నగరవాసులు కాస్త ఆలస్యంగానే లేస్తారని ఓ అధికారి సైతం గుర్తుచేశారు. కానీ, మరీ ఆలస్యం అయ్యింది. ఇకనైనా మేల్కొండి. ఓటింగ్ పర్సంటేజ్‌ను పెంచండి.
SHARE IT
News November 11, 2025
ఆత్మాహుతి దాడే! బలం చేకూరుస్తున్న ఆధారాలు

DL: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఆత్మాహుతి దాడి అనేలా ఆధారాలు లభిస్తున్నాయి. i20 కారులో ఫ్యూయల్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హరియాణా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిఖ్ కొన్నాక పలువురి నుంచి నిన్న డ్రైవ్ చేసిన Dr.ఉమర్‌కు చేరింది. JK పోలీసులు UP ఫరీదాబాద్‌లో నిన్న అరెస్టు చేసిన ఉగ్రవాద అనుమానితులతో ఇతడికి కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం.
News November 11, 2025
భీమవరం: ‘మా అమ్మ, తమ్ముడు దెయ్యాలు’.. నిందితుడి వీడియో వైరల్

భీమవరంలో తల్లి, తమ్ముడిని దారుణంగా గంట పాటు <<18246456>>పొడిచి చంపిన<<>> తర్వాత శ్రీనివాస్ రోడ్డుపైకి వచ్చి మాట్లాడిన మాటలు భయబ్రాంతులకు గురి చేశాయి. ‘మా అమ్మ, తమ్ముడు మనుషులు కాదు దెయ్యాలు. నన్ను పీక్కుతింటున్నారు. వాళ్ల కడుపులో ఎన్నిసార్లు పొడిచినా చావట్లేదు. నా మనసులో ఏం అనుకున్నా వాళ్లకు తెలిసిపోతోంది. నాకు పిచ్చి అంటున్నారు’ అని చెప్పడం భయం కలిగించింది. కాగా అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తేల్చారు.


