News August 29, 2025
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి: KMR SP

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి NH-44పై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినడమే కాకుండా, నిన్న మరమ్మతులు చేసిన ప్రాంతాలు కూడా కూలిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని SP రాజేశ్ చంద్ర సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం ఒక లైన్ మాత్రమే అత్యవసర వాహనాలకు అందుబాటులో ఉందని, మేడ్చల్, ఆర్మూర్, నిర్మల్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News August 29, 2025
కామారెడ్డి: హమ్మయ్యా.. వరుణుడు శాంతించాడు.!

మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు ఈరోజు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరదలు, జలమయమైన రహదారులతో కకావికలం అయిన జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఉదయం నుంచి వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. అధికార యంత్రాంగం పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి.
News August 29, 2025
సిరిసిల్ల: ‘ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం ఏర్పాటు’

మానేరువాగులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల, మత్స్యశాఖ, పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. చెక్, డ్యాములు, బ్రిడ్జిలు, కల్వర్టుల ప్రాంతాల్లో తనిఖీ చేయాలన్నారు.
News August 29, 2025
నిజామాబాద్: రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్

హైదరాబాద్‌లో రేపటి నుంచి తెలంగాణ యువ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో పాల్గొనే శాతవాహన జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లాలో తమ శిక్షణ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. జట్టుకు జిల్లాకు చెందిన మీసాల ప్రశాంత్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.