News December 24, 2024
ప్రత్యేక అలంకరణలో పైడితల్లమ్మ
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Similar News
News December 25, 2024
విజయనగరం: మహిళ అనుమానాస్పద మృతి
విజయనగరం – కోరుకొండ రైల్వే స్టేషన్ మధ్యలో సారిక సమీపంలో పట్టాలు పక్కన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. రైల్వే ఎస్ఐ బాలాజీరావు వివరాలు మేరకు.. వయసు 25-30 ఏళ్ల మధ్యలో, ఐదు అడుగులున్న ఎత్తు ఉంటుంది. ఆమె వివరాలను గుర్తించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు.
News December 25, 2024
గంజాయి రవాణా పై కఠినంగా వ్యవహారించాలి: VZM SP
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.
News December 24, 2024
బొబ్బిలిలో యాక్సిడెంట్.. చికిత్స పొందతూ మృతి
బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.