News October 17, 2025

ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0: కలెక్టర్

image

జనగామ జిల్లా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, అన్ని అంశాల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన స్థానంలో జిల్లా నిలబడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్య శాఖ అధికారి పింకేష్ కుమార్‌తో కలిసి విజయోస్తు 2.0, పదవ తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులతో రివ్యూ నిర్వహించారు.

Similar News

News October 17, 2025

3 రోజులు సెలవులు!

image

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 17, 2025

సుర్యాపేట: అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి: కలెక్టర్

image

ఆకాశమే హద్దుగా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలోకి తీసుకొని రావాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకు సూచించారు. కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖలోని మహిళా సాధికారత ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం-2025 కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.

News October 17, 2025

రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.