News October 12, 2025
ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి: ఎంపీ

పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల క్రీడా మైదానాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా క్రీడల అధికారి శ్రీనివాసరావును ఆదేశించారు. నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 12, 2025
‘విశాఖ స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్ సాధించుకుందాం’

రాజకీయాలకు అతీతంగా <<17977459>>బాలాజీ రైల్వే డివిజన్<<>>ను సాధించుకుందామని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో దీనిపై ఆదివారం సమావేశం జరిగింది. ఇందులో భాగంగా బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకతను పలువురు నొక్కి చెప్పారు. విశాఖ ఉక్కు స్ఫూర్తితో బాలాజీ రైల్వే డివిజన్ సాధించికుందామని వారు పిలుపునిచ్చారు.
News October 12, 2025
బంగారు పల్లకీలో ఊరేగించి.. కలెక్టరుకు వీడ్కోలు

తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం పొందే అధికారులను చాలాఅరుదుగా చూస్తుంటాం. వారిలో ఒకరే మధ్యప్రదేశ్ సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్. ఆమె బదిలీ సందర్భంగా బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు సిబ్బంది. గిఫ్ట్ ఎ డెస్క్ ప్రోగ్రాం, అనేక ప్రజోపయోగ కార్యక్రమాలతో ఈ కలెక్టర్ ప్రజలకు చేరువై ప్రశంసలు దక్కించుకున్నారు. ఉద్యోగంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News October 12, 2025
శ్రీశైలంలో పటిష్ఠ బందోబస్తు: SP

ఈనెల 16న ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలలు, నల్లమల అడవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలు ప్రధాని పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.