News December 26, 2025
ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.
Similar News
News December 26, 2025
SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.
News December 26, 2025
రేపు రూ.97 కోట్లతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.97 కోట్ల అంచనాతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్ రూపొందించారు. ఆరంభనిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. జమలు రూ.90.89 కోట్లు, ఖర్చు రూ.97.04 కోట్లుగా బడ్జెట్ రూపొందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జమలు రూ.66.50 కోట్లు, ఖర్చులు రూ.63.55 కోట్లుగా చూపారు. నిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. శనివారం బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చైర్ పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు.
News December 26, 2025
ఇరగవరం: అమరజీవి జలధారకు శంకుస్థాపన

శుద్ధిచేసిన తాగునీటిని ఇంటింటికీ అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఇరగవరం మండలం కత్తవపాడులో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి మొదటి దశలో తణుకు నియోజకవర్గం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.


