News November 19, 2025

ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే వేగవంతం చేయాలి

image

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో అధికారులకు ఆవాస్ ప్లస్ 2024 సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ స్వచ్ఛత, చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి క్లోరినేషన్ విషయాల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఆదర్శ గ్రామ యోజన పనులను వేగంగా పూర్తి చేయాలని, అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు.

Similar News

News March 6, 2026

NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.

News March 6, 2026

కోనసీమ: టెన్త్ స్టూడెంట్స్.. HI అని మెసేజ్ చేస్తే చాలు..!

image

విద్యార్థులు వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులందరూ వాట్సాప్ ద్వారా ‘మనమిత్ర’ మొబైల్ నెంబర్ 9552300009 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు సులభంగా హాల్ టికెట్లు చేరువచేసేందుకు ప్రభుత్వం మనమిత్ర యాప్‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచిందన్నారు.

News March 6, 2026

పెద్దపల్లి: ఐటీఐ అభ్యర్థులకు సువర్ణ అవకాశం!

image

పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ‘పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకట్రెడ్డి తెలిపారు. ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, కోపా తదితర ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని, ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు.