News January 8, 2026

ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

image

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.

Similar News

News February 20, 2026

Pax Silicaలోకి భారత్.. ఏంటీ కూటమి?

image

భారత్ ‘Pax Silica’ డిక్లరేషన్‌లో చేరింది. సెమీకండక్టర్ సప్లై చైన్, AI వంటి కీలక సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ ఒప్పంద ఉద్దేశం. గ్లోబల్ చిప్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్య దేశాల మధ్య సురక్షితమైన, నమ్మదగిన టెక్నాలజీ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా ఎదిగేందుకు సహకారం అందనుంది.

News February 20, 2026

పొట్ట చుట్టూ కొవ్వు.. క్యాన్సర్‌కి సంకేతమా?

image

ఊబకాయం సమస్యను ఈజీగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఊబకాయం శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తూ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెస్ట్, కోలన్, లివర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లకు అధిక కొవ్వు ప్రధాన కారణం. హెల్తీ ఫుడ్, వ్యాయామం, బరువు నియంత్రణతో దీని నుంచి బయటపడొచ్చు’ అని వారు సూచిస్తున్నారు.

News February 20, 2026

గ్రీక్ యోగర్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు

image

గ్రీక్ యోగర్ట్‌ను చాలామంది పెరుగుకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఇందులో నీరు, లాక్టోస్ లేకుండా ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ షుగర్ ఉంటాయి. దీంట్లోని ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్, ఎముకల ఆరోగ్యం బావుంటుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట యోగర్ట్‌ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్‌, గుండె సమస్యలు, క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.