News July 24, 2024
ప్రధాని హామీ ఇచ్చినా.. పాలమూరుకు మొండి చెయ్యి
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర బడ్జెట్‌లో మరోసారి మొండి చేయి చూపింది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించారు. జాతీయ హోదా సంగతి అటుంచితే ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు ఇవ్వడం లేదు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన కేంద్రం పాలమూరుకు మాత్రం ఏమాత్రం కేటాయించలేదు.
Similar News
News January 17, 2025
MBNR: రెండు మ్యాచ్‌లో సంచలన విజయం.!
చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో సౌత్ జోన్ టోర్నీలో పాలమూరు యూనివర్సిటీ జట్టు శుక్రవారం నిర్వహించిన రెండు మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. 3వ మ్యాచ్ కలసలింగమ్ అకాడమీ ఆఫ్ రిసెర్స్& ఎడ్యుకేషనల్ యూనివర్సిటిపై 15 పరుగులతో, 4వ మ్యాచ్‌లో డా.MGR ఎడ్యుకేషనల్&రిసెర్చ్ ఇనిస్ట్యూట్(TN) పై 103 పరుగులతో ఘన విజయం సాధించి ఫ్రీ క్వార్టర్స్ ఫైనల్‌కు చేరింది. దీంతో పలువురు అభినందించారు. >>CONGRATULATIONS❤
News January 17, 2025
వనపర్తి: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYDలోని అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వనపర్తి(D) పెద్దగూడెంకు చెందిన భానుప్రకాశ్ ఓ కళాశాలలో బీటెక్ 1st ఇయర్ చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై ఉరేసుకున్నాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. అమ్మానాన్నలకు నోట్ బుక్‌లో లేఖను రాసినట్లు తెలుస్తోంది.
News January 17, 2025
MBNR: పంచాయతీ పోరు.. బ్యాలెట్ సిద్ధం!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. సర్పంచ్ అభ్యర్థులకు గులాబి.. వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. MBNR-441 GPలో 3,836 వార్డులు, NGKL-464 GPలో-4,140 వార్డులు, NRPT-280 GPలో 2,455 వార్డులు, WNPT-260 GPలో-2,366 వార్డులు, GDWL-255 GPలో 2,390 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది.