News January 19, 2026

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్.. కాకినాడలో రికార్డు

image

కాకినాడలో రూ.83 వేల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఏటా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను పర్యావరణ పరిరక్షణలో అగ్రగామిగా నిలపనుంది. తొలి దశలో 1 మిలియన్ టన్నుల ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించే ఈ ప్లాంట్ ద్వారా లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గనున్నాయి.

Similar News

News February 21, 2026

GVMC పరిధిలో సర్వేయర్ల దోపిడీ ఆరోపణలు!

image

GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ భూముల వివరాలు,సర్వే సర్టిఫికెట్లు,విఎల్టీ,ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.పనిని బట్టి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఎస్టేట్ విభాగం పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.

News February 21, 2026

బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

image

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.

News February 21, 2026

అమరావతి రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి టెండర్లు

image

అమరావతి-కృష్ణా రివర్‌ఫ్రంట్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం ఏజీఐసీఎల్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కన్సల్టెంట్ల నియామకానికి మార్చి 13 వరకు బిడ్‌లు దాఖలు చేసే అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా కమర్షియల్, ఫైనాన్షియల్, టూరిజం జోన్లను అభివృద్ధి చేస్తారు. వరదలను తట్టుకునేలా 6-8 లైన్ల రోడ్లు, అత్యాధునిక మౌలిక వసతులు నిర్మించనున్నారు.