News December 20, 2025
ప్రపంచంలో స్త్రీని చూడని ఏకైక పురుషుడు!

స్త్రీ, పురుషులు ఒకరి ముఖం ఒకరు చూడకుండా ఉంటారా? కానీ గ్రీస్‌కు చెందిన ఓ వ్యక్తి తన 82ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా స్త్రీ ముఖం చూడలేదు. మిహైలో టొలోటోస్ అనే సన్యాసి 1856లో జన్మించగా.. పుట్టిన 4 గంటల్లోనే తల్లి చనిపోయింది. దీంతో అతడిని సన్యాసులు స్త్రీలకు ప్రవేశం లేని మౌంట్ అథోస్‌కు తీసుకెళ్లారు. కారు, విమానం వంటి ఆధునిక ప్రపంచపు ఆనవాళ్లు కూడా ఆయనకు తెలియవు. జీవితాంతం ప్రార్థనలతో గడిపారు.
Similar News
News December 21, 2025
U19 Asia Cup: మరోసారి ‘కప్’ గొడవ?

మెన్స్ <<17879920>>ఆసియా కప్ ట్రోఫీ<<>> విషయంలో ACC చీఫ్ నఖ్వీతో వివాదం గురించి తెలిసిందే. ఇప్పటికీ ట్రోఫీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరోసారి కప్ గొడవ జరిగేలా కనిపిస్తోంది. ఇండియా-పాక్ U19 Asia Cup <<18629192>>ఫైనల్<<>>కు నఖ్వీ హాజరవుతారని తెలుస్తోంది. మ్యాచ్ విన్నర్లకు ట్రోఫీని ఆయనే అందజేస్తారు. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఆయన నుంచి ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించే అవకాశం ఉంది. దీంతో నఖ్వీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.
News December 21, 2025
సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో: బీజేపీ

TG: సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది. వ్యక్తిపూజలో రేవంత్ అన్ని హద్దులను దాటేశారని విమర్శించింది. సోనియా వల్లే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడని రేవంత్ త్వరలో చెబుతారేమోనని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
News December 21, 2025
నేలలో అధిక తేమ వల్ల ఏ సమస్యలు వస్తాయి?

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.


