News December 31, 2025
ప్రపంచం మనల్ని ఆశతో చూస్తోంది: మోదీ

భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఎక్కిందని PM మోదీ పేర్కొన్నారు. ప్రపంచం మనల్ని ఆశ, విశ్వాసంతో చూస్తోందని చెప్పారు. ‘ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ముందుకు సాగింది. ప్రజలు గౌరవంతో బతికేందుకు, ఆంత్రప్రెన్యూర్స్ ఆవిష్కరణలు చేయడానికి, కంపెనీలు స్పష్టతతో పని చేయడానికి సంస్కరణలు ఉపయోగపడ్డాయి’ అని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. GST, కార్మిక చట్టాలు, ఉపాధి చట్టం, బీమా కంపెనీల్లో 100% FDI వంటి వాటిని ప్రస్తావించారు.
Similar News
News February 16, 2026
మండపారాధన అంటే మీకు తెలుసా?

వ్రతం/పూజ చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే ప్రక్రియే మండపారాధన. ఇందులో ప్రధాన దైవంతో పాటు పంచపాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులను కూడా పిలుస్తారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. పూజలో పెట్టే వక్క దేవతాంశకు, పసుపుకొమ్ము స్త్రీ రూప దేవతా శక్తికి, ఖర్జూరం నైవేద్యంగా, అక్షింతలు దేవతా అర్చన కోసం, నాణెం హిరణ్య రూప దక్షిణగా సమర్పిస్తారు. వీటితో గ్రహ దోషాలు పోతాయని నమ్మకం.
News February 16, 2026
లాకర్లలోని 2.7 KGల బంగారాన్ని కొట్టేసిన అసిస్టెంట్ మేనేజర్.. ఎందుకంటే?

బెంగళూరులో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అలవాటు పడ్డ ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కస్టమర్లకు చెందిన 2.7 KGల బంగారాన్ని (దాదాపు రూ.4 కోట్లు) కొట్టేశాడు. ఇండియన్ బ్యాంకుకు చెందిన కిరణ్ మేనేజర్ లేని సమయంలో తన లాకర్ యాక్సెస్‌తో కస్టమర్ల గోల్డ్ కొట్టేశాడు. దాన్ని తాకట్టు పెట్టి ఎంజాయ్ చేసేవాడు. ఓ మహిళ తన బంగారం కోసం రావడంతో గుట్టురట్టయింది. పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేసి 700 గ్రా. బంగారం రికవరీ చేశారు.
News February 16, 2026
సీనియర్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!

బాలీవుడ్ గ్లామరస్, సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ SMలో బ్యూటీ, ఫిట్‌నెస్ సీక్రెట్లు పంచుకుంటూ ఉంటారు. ఉదయం ఖాళీ కడుపుతో బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగడం తనకు అలవాటని ఆమె చెప్పారు. దీనివల్ల ఎనర్జీ, పేగు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, మెంటల్ హెల్త్ మెరుగవ్వడం, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో స్వచ్ఛమైన దేశీ నెయ్యి కలిపి తీసుకునేదే ఈ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ.


