News December 15, 2025
ప్రపంచకప్‌లో వాళ్లే గెలిపిస్తారు: అభిషేక్ శర్మ

తన సహచర క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌కు అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచారు. రానున్న T20 వరల్డ్ కప్‌లో వాళ్లిద్దరూ మ్యాచ్‌లు గెలిపిస్తారని అన్నారు. ‘నేను చాలా కాలంగా వారితో కలిసి ఆడుతున్నాను. ముఖ్యంగా గిల్ గురించి నాకు తెలుసు. అతడిపై నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. అతి త్వరలో అందరూ గిల్‌ను నమ్ముతారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. కాగా ఇటీవల గిల్, సూర్య <<18568094>>వరుసగా<<>> విఫలమవుతున్న విషయం తెలిసిందే.
Similar News
News December 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 99

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 17, 2025
CUSB 84 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB) 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in
News December 17, 2025
రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.


