News January 25, 2025

ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం: శ్రీధర్ బాబు

image

మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు ‘డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్’ ప్రతినిధి నిక్ మాయెన్‌కోర్ట్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలతో కలసి పనిచేయడం ద్వారా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Similar News

News July 9, 2025

బాపట్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

బాపట్ల మండలం కప్పలవారిపాలెం గ్రామం సమీపంలోని నాగరాజు కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభించింది. బాపట్ల రూరల్ పోలీసులు కథనం మేరకు.. కప్పల వారి పాలెం గ్రామంలోని నాగరాజు కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 9, 2025

కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

image

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 9, 2025

KNR: లోకల్ ఎన్నికలు.. ఆ పార్టీలు తగ్గేదేలే..!

image

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు. కాగా నిన్న కాంగ్రెస్ ఉమ్మడి KNR జిల్లా ఇన్‌ఛార్జ్‌గా అద్దంకి దయాకర్‌ను అధిష్ఠానం నియమించగా పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ చేయనున్నారు. మరోవైపు KTR ఆదేశాలతో ఇప్పటికే BRS నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. BJP సైతం గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది.