News December 8, 2025

ప్రపంచాన్ని ఏకం చేసేలా HYDలో సమ్మిట్‌

image

HYD శివారు మీర్‌ఖాన్‌పేట్ గ్లోబల్ సమ్మిట్‌కు వేదికైంది. 44కిపైగా దేశాలు, 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీలు పాల్గొననున్న ఈ సమ్మిట్‌ మ.1:30కు ప్రారంభం కానుంది. నోబెల్ గ్రహీతలు అభిజిత్, కైలాష్ సత్యర్థి ప్రధాన వక్తలు. వీరిలో 46 మంది అమెరికా ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, అమెజాన్, ఐకియా తదితర ప్రతినిధులు ఉన్నారు. అంతేకాదు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ కంపెనీలు, ఇతర దేశాల రాయబారులు రానున్నారు.

Similar News

News April 14, 2026

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లాలోనే..!

image

రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నిజామాబాద్ జిల్లా మాచర్లలో 43.2°C ల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా పూర్తిగా ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. జిల్లాలో అన్ని వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎండలు తీవ్రం కావడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాలులు సైతం వీయడంతో తప్పనిసరి జాగ్రతలు వహించాలన్నారు.

News April 14, 2026

సంగారెడ్డి: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

image

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ​ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత సంగారెడ్డి జిల్లా మనూరు, నాగలిగిద్ద, సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాను కలవరపెట్టాయి. ఇలా చేయకండి.

News April 14, 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు!

image

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సోమవారం ఎండలు మండిపోయాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ఠ, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 42, గుంటూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెనాలిలో 38 డిగ్రీలు నమోదు కాగా, బాపట్ల, చీరాలలో 36 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.