News December 16, 2025
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.
Similar News
News December 18, 2025
గాలి కాలుష్యాన్ని అలా తగ్గించాం: చైనా ఎంబసీ

గాలి కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజింగ్‌లో తాము ఎలా పొల్యూషన్‌ను అరికట్టామో ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ వెల్లడించారు. ‘దశలవారీగా పాత బండ్లను తొలగించాం. సరి-బేసి అమలు చేశాం. అతిపెద్ద మెట్రో, బస్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేశాం. ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచాం. 3వేల భారీ పరిశ్రమలను మూసేశాం. ఫ్యాక్టరీలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చాం’ అని వివరించారు.
News December 18, 2025
ఇన్సూరెన్స్ కాల్స్ ‘1600’ నంబర్ల నుంచే రావాలి: TRAI

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్ల నుంచే రావాలని పేర్కొంది. ఈ నిబంధనను IRDAI పరిధిలోని అన్ని బీమా సంస్థలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫేక్ కాల్స్, ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని TRAI భావిస్తోంది.
News December 18, 2025
భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్ మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.


