News December 22, 2025
ప్రపంచ రికార్డు సృష్టించారు

న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, లాథమ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో శతకాలు బాదారు. దీంతో ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన తొలి ఓపెనర్లుగా నిలిచారు. తొలి ఇన్నింగ్సులో కాన్వే(227), లాథమ్(137) చేశారు. రెండో ఇన్నింగ్సులో లాథమ్(101), కాన్వే(100) శతకాలు బాదారు.
Similar News
News December 22, 2025
నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

TG: దాదాపు రెండేళ్ల తర్వాత ఇవాళ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 2024 జనవరిలో పాలక మండళ్ల పదవీకాలం ముగియగా.. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారులే పాలనను కొనసాగించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇవాళ మొదటి సమావేశంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పనులు, తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలు వంటివి వీరికి సవాలుగా మారే అవకాశముంది.
News December 22, 2025
బిగ్‌బాస్ విన్నర్.. ఎంత గెలుచుకున్నారంటే?

బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా నిలిచినందుకు కళ్యాణ్ పడాల రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారానికి రూ.70వేల చొప్పున రూ.10.50 లక్షలు సంపాదించారు. రాఫ్ టైల్స్ కంపెనీ ఆయనకు మరో రూ.5 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో మొత్తం రూ.50 లక్షలు దాటింది. మరోవైపు మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును ఆయన అందుకున్నారు.
News December 22, 2025
అప్పుడు ‘కిసాన్’.. ఇప్పుడు ‘జవాన్’

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అద్భుతం చోటుచేసుకుంది. 2023 సీజన్-7లో ‘జై కిసాన్’ అంటూ ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జవాన్’ కళ్యాణ్ పడాల ‘బిగ్ బాస్-9’ <<18635005>>టైటిల్<<>>ను గెలిచారు. తొలి రోజు నుంచే కళ్యాణ్ తన నిజాయతీతో కూడిన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వీరు బిగ్‌బాస్ విన్నర్లుగా నిలవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.


