News March 13, 2025
ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.
Similar News
News July 7, 2025
ఎన్టీఆర్: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్‌మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
News July 7, 2025
రైల్వే స్టేషన్లో మహిళకు ప్రసవం.. ఆర్మీ వైద్యుడిపై ప్రశంసలు

UPలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఓ నిండు చూలాలికి ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ పురుడు పోసి మానవత్వం చాటారు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న రైలులో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అదే మార్గంలో HYD వెళ్లే రైలు కోసం వేచి ఉన్న రోహిత్ విషయం తెలియగా రైల్వే సిబ్బంది సహకారంతో ఆమెకు సురక్షితంగా డెలివరీ చేశారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆర్మీ వైద్యుడిని అందరూ ప్రశంసిస్తున్నారు.