News February 2, 2025
ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)

గచ్చిబౌలిలోని పబ్‌లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News February 20, 2026
ట్రంప్ వార్నింగ్‌తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు $67 వద్ద 6 నెలల పీక్‌కు చేరాయి. అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ 15 రోజుల గడువు విధించడం, మిడిల్ఈస్ట్‌లో సైనిక మోహరింపుతో ఆయిల్ సప్లైపై భయాలు పెంచింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా నిలిచిపోతే బ్యారెల్ ధర $100కు చేరొచ్చని నిపుణుల అంచనా! అమెరికాలో ఆయిల్ రిజర్వులు తగ్గడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణం.
News February 20, 2026
చిన్నారుల్లో హెయిర్ ఫాల్

ప్రస్తుతకాలంలో హెయిర్ ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా అందేలా డైట్ మార్చాలి. జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం వల్ల కూడా జుట్టు రాలొచ్చు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
News February 20, 2026
నెల్లూరు- బద్వేల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు వేగంగా అడుగులు..!

రాయలసీమ, నెల్లూరు జిల్లాల పారిశ్రామికీకరణలో కీలకమైన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకూ నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది.


