News March 1, 2025
ప్రభాకర్ సేవలను కొనియాడిన చిత్తూరు కలెక్టర్

జిల్లా పశుసంవర్ధకశాఖలో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేస్తూ మూగజీవాలు, రైతులకు డాక్టర్ ప్రభాకర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మిట్టూరులోని ఎన్పీసీ పెవిలియన్‌లో జరిగిన ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు.
Similar News
News February 28, 2025
చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ కుప్పం: అంధ యువతి పెళ్లికి CM చంద్రబాబు రూ.5 లక్షల సాయం
✒ కత్తెరపల్లి ZP ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు
✒ SRపురం: బెల్లంపాకంలో పడి వ్యక్తి మృతి
✒ పలమనేరులో ఏడుగురు అరెస్ట్
✒ కుప్పంలోని హోటళ్లలో అధికారుల తనిఖీలు
News February 28, 2025
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు: జిల్లా ఎస్పీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా ట్రయిల్ రన్ నిర్వహించారు. మార్చి నెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులలో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
News February 28, 2025
గుడిపల్లి : మామిడి తోటలో ఏమేం దొరికాయి అంటే..?

ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ మామిడి తోటలో దొరకడం కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రం తీసుకునే రిజిస్టర్లతో పాటు క్వశ్చన్ పేపర్లను భద్రపరిచిన లాకర్ కీ, ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్, కస్టోడియల్ అధికారి వద్ద ఉండాల్సిన రెండు రిజిస్టర్లు, ప్రశ్నాపత్రం కోడ్ రిసీవింగ్‌కు సంబంధించిన అధికారిక ఫోన్, ఎగ్జామ్‌కు సంబంధించిన పలు పేపర్లు పడి ఉన్నట్లు తెలుస్తోంది.