News February 19, 2026
ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కాల్సిన మూవీ రద్దయిందన్న ప్రచారంలో నిజం లేదని సినీవర్గాలు తెలిపాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి-2’తో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాక ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు వర్మ ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీసేందుకు సిద్ధమయ్యారు. రిషబ్ శెట్టి నటిస్తున్న ఆ సినిమా పూజా కార్యక్రమం ఈనెల 22న హంపీలో జరగనుంది.
Similar News
News February 20, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News February 20, 2026
TN CM స్టాలిన్‌తో పన్నీరు సెల్వం భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మాజీ CM, AIADMK బహిష్కృత నేత పన్నీరు సెల్వం CM స్టాలిన్‌ను కలిశారు. ఐదేళ్ల DMK పాలనను కొనియాడారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో DMK మరోసారి విజయం సాధిస్తుందన్నారు. CMను కలిసి ఐదేళ్ల పాలన బాగుందని చెప్పి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీతో పన్నీరుసెల్వం వర్గం DMKతో ఎన్నికలకు వెళ్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
News February 20, 2026
TGకి రూ.387 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కింద రావలసిన నిధుల్లో ₹387 CRను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. వీటిని గ్రామాల్లో మౌలికసదుపాయాల కల్పన, పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు వినియోగించాలని ఆదేశించింది. కాగా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం విడతల వారీగా ఈ నిధులను రాష్ట్రానికి అందిస్తోంది. ఇప్పటివరకు ₹1034.42 CR వచ్చాయి. ఇంకా ₹2000 CR రావాల్సి ఉంది. వీటిని వెంటనే అందించాలని మంత్రి సీతక్క కోరారు.


