News February 27, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’లో వివేక్ ఒబెరాయ్

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ప్రకటించిన టీమ్.. ఆయన లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 5, 2027న రిలీజ్ కానుంది. ఇందులో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News March 2, 2026

నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలి: CM CBN

image

AP: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశమివ్వాలని CM CBN ఆదేశాలు జారీ చేశారు. RTGS, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై సమీక్షించిన ఆయన, ఈ నెల నుంచి పబ్లిక్ పర్సెప్షన్‌ 80-90%కి తగ్గకుండా ఉండాలన్నారు. ‘అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్ల మరమ్మతులు పూర్తి చేయాలి. పెన్షన్ల పంపిణీ, ‘దీపం’ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని ఆఫీసర్లకు సూచించారు.

News March 2, 2026

మిస్టరీ విలేజ్.. రాత్రికి రాత్రే అంతా ఖాళీ!

image

రాజస్థాన్‌లోని కుల్ధారా ఒక మిస్టరీ గ్రామం. సుమారు 200 ఏళ్ల క్రితం జైసల్మేర్ పాలివాల్ బ్రాహ్మణులు నివసించే ఈ గ్రామం రాత్రికి రాత్రే నిర్మానుష్యమైంది. దుర్మార్గపు మంత్రి సలీం సింగ్ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఊరిని వదిలివెళ్తూ అది ఎప్పటికీ నివాసయోగ్యం కాకూడదని శపించారట. ఇప్పటికీ ఇది ఒక ‘ఘోస్ట్ విలేజ్’గా పర్యాటకులను భయపెడుతోంది. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..

News March 2, 2026

రైల్వేలో 22,195 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

image

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మార్చి 3 నుంచి మార్చి 9వ తేదీకి పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 11తో ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: <>www.rrbchennai.gov.in<<>>