News February 9, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న నటుడు!

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్‌గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.
Similar News
News February 9, 2026
పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్‌లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.
News February 9, 2026
జంద్యం ధరిస్తున్నారా?

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
News February 9, 2026
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.


