News December 21, 2025

ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది: KCR

image

TG: పంచాయతీ ఎన్నికల్లో BRS మెరుగైన ఫలితాలు సాధించిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే BRS సత్తా తెలిసేదని తెలిపారు. తనను తిట్టడం, తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని విమర్శించారు.

Similar News

News January 2, 2026

వంశీని అరెస్ట్ చేయవద్దు.. హైకోర్టు ఆదేశం

image

AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మాచవరం పీఎస్‌లో వంశీపై హత్యాయత్నం కేసు నమోదు కాగా ముందస్తు బెయిల్‌ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

News January 2, 2026

శనగపిండితో చర్మానికి ఎన్నో లాభాలు

image

శనగపిండిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గించి చర్మ రంధ్రాలను శుభ్రపరచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చే క్లెన్సర్‌గానూ పనిచేస్తుంది. ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మార్చేస్తుంది. దీనికి గంధం, పాలు, ముల్తానీ మట్టి, కాఫీ పొడి, నిమ్మరసం, పెరుగు, తేనె, పసుపు వంటివి కలిపి రాస్తే అదనపు ప్రయోజనాలుంటాయి.

News January 2, 2026

BRSకు కవిత డెత్ వార్నింగ్!

image

తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో కవిత BRSకు డెత్ వార్నింగ్ ఇచ్చారు. KCR రాకపోతే BRSను భగవంతుడు కూడా కాపాడలేడన్నారు. KCR అసెంబ్లీలో మాట్లాడాలని పార్టీలు, ప్రజలు కోరుతున్న వేళ కూతురూ ఇదే మాట అని పుట్టింటి పార్టీని ఓ విధంగా ఇరకాటంలో పెట్టారు. గులాబీ బాస్‌పై కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడుతూనే KCR లేకపోతే పార్టీ కథ ముగిసినట్లే అని పరోక్షంగా హెచ్చరించారు. కవిత కామెంట్లతో మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.