News November 23, 2025

ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

image

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

Similar News

News November 24, 2025

మృణాల్‌తో ధనుష్ డేటింగ్?.. పోస్టులు వైరల్

image

ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్‌ చేస్తున్నారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. మృణాల్ నటించిన ‘దో దీవానే షెహర్ మే’ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. దీనిపై ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా ‘చాలా బాగుంది’ అనే అర్థంలో ధనుష్ కామెంట్ చేశారు. దీనికి హీరోయిన్ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చారు. ఈ స్క్రీన్ షాట్లను అభిమానులు వైరల్ చేస్తున్నారు. వారిమధ్య బంధం నిజమేనంటున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరగగా మృణాల్ ఖండించారు.

News November 24, 2025

డిటెన్షన్ సెంటర్లకు అక్రమ వలసదారులు: యూపీ సీఎం

image

అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను యూపీ CM యోగి ఆదేశించారు. ప్రతి జిల్లాలో తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశీ పౌరసత్వం ఉన్న వలసదారుల వెరిఫికేషన్ పూర్తయ్యేవరకు డిటెన్షన్ సెంటర్లలో ఉంచాలని సూచించారు. వారు స్థిరపడిన విధానాన్ని బట్టి స్వదేశాలకు పంపించాలన్నారు. మరోవైపు 8ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పుడు కావాలనే హడావిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.

News November 23, 2025

ఇలా పడుకుంటే ప్రశాంతమైన నిద్ర

image

రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర కోసం ఎడమ వైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ‘బోర్లా, వెల్లకిలా కంటే ఈ పొజిషన్‌లో మంచి నిద్ర వస్తుంది. గుండెకు రక్తసరఫరా, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శ్వాసలో ఇబ్బందులు, గురక సమస్య తగ్గుతుంది. ఎక్కువసేపు బోర్లా పడుకుంటే నడుము, మెడ నొప్పి, శ్వాస సమస్యలు పెరుగుతాయి. తల కింద దిండు అలవాటు ఉన్నవాళ్లు సాఫ్ట్ పిల్లోలను ఎంచుకోవాలి’ అని సూచిస్తున్నారు.