News January 19, 2026
ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.
Similar News
News February 11, 2026
11-11-11 అంటూ వైసీపీ MLAలపై స్పీకర్ సెటైర్లు

AP: అసెంబ్లీ లాబీలో వైసీపీ MLAలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ నేతలు సభ నుంచి <<19108172>>బయటకు<<>> వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై సభలో చర్చకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
News February 11, 2026
బాలకృష్ణ తర్వాతి సినిమాల లైనప్ ఇదేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత సితార ఎంటర్టైన్‌మెంట్స్&హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేస్తారని, అది 2027 సంక్రాంతికి రిలీజవ్వొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లోనూ బాలయ్య మూవీ ఉంటుందని, మైత్రి సంస్థ నిర్మించబోయే ఈ మూవీ 2027లో రిలీజవుతుందని టాక్.
News February 11, 2026
ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.


