News November 10, 2024
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక: కలెక్టర్ నాగారాణి
ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ.గో.జిల్లా తిపర్రు- 2&3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిపర్రులో రూ.96.02, ఔరంగాబాద్‌లో రూ.229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.
Similar News
News November 13, 2024
ఏలూరు: బ్యాంకు అకౌంట్లో నుంచి రూ. 46.30 లక్షలు మాయం
ఏలూరు వాసి కె.శేషగిరి ప్రసాద్‌కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో రూ.46.30 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుని కథనం..ఈనెల 8న తన అకౌంట్లోకి రూ.20 వేలు వచ్చాయి. కాసేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి పొరపాటున వేశామని తిరిగి తనకు పంపాలన్నాడు. ఆయన మాటలు నమ్మిన శేషగిరి ఆ డబ్బును తిరిగి పంపాడు. ఈనెల10న ఖాతా చెక్ చేయగా రూ.46.30 లక్షలు కట్ అయినట్లు గుర్తించి, ఏలూరు 2 టౌన్ పోలీసులను ఆశ్రయించగా..వారు దర్యాప్తు చేపట్టామన్నారు.
News November 13, 2024
ప.గో: గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యదర్శి యం.శేఖర్ బాబు ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవంతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
News November 12, 2024
ఏలూరు: జిల్లా జైల్‌ను పరిశీలించిన ఎస్పీ
ఏలూరు జిల్లా జైల్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్‌లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.