News October 15, 2025

ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. ఖమ్మం నుంచే షురూ..!

image

ప్రభుత్వం పచ్చదనంతో పాటు ఆదాయం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో ప్రభుత్వ స్థలాలు, రహదారులు, బీడు భూముల్లో ఆయిల్‌పామ్ మొక్కలు పెంచి పచ్చదనంతో పాటు ఆదాయం పొందేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంను మోడల్‌గా తీసుకుని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ స్థలాల్లో మొక్కలను నాటడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదాయం లభించనుంది.

Similar News

News October 15, 2025

కొత్తగూడెం: కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలి

image

వానాకాలం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచించారు. రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

News October 15, 2025

కామారెడ్డి: ‘ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం’

image

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. AICC అబ్జర్వర్ రాజ్ పాల్ కరోలా హాజరయ్యారు. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ డీసీసీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.

News October 15, 2025

కష్టపడిన వారికే పదవులు దక్కుతాయి: ఎంపీ RRR

image

కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కృషి చేసిన, కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు పని చేసిన వారిని మర్చిపోమని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషికి గుర్తింపు ఉంటుందని చెప్పారు.