News January 7, 2026
ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచండి: VZM కలెక్టర్

వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి తగ్గ ఆదాయం రాకపోవడంపై బుధవారం సమీక్షించారు. గనుల శాఖలో లీజుల గడువు ముగియడంతో ఆదాయం తగ్గిందని, త్వరలో పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ద్వారా లక్ష్యానికి దగ్గరగా ఆదాయం వచ్చిందని, నాటుసారా, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 17, 2026
VZM: ‘గనుల లీజుకు త్వరగా అనుమతులు’

నిబంధనలను పరిశీలించిన అనంతరం గనుల లీజుకు వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని JC సేధు మాధవన్ చెప్పారు. సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆద్వర్యంలో వీసీ నిర్వహించారు. గరివిడి మండలం మందిరవలస, చీపురుపల్లి మండలం నిమ్మలవలస, నెల్లిమర్ల మండలం జగ్గిరాజుపేట గనుల కోసం వివరించి NOC మంజూరు చేస్తామని తెలిపారు.
News February 17, 2026
VZM: విశాఖలో సాగర సంగ్రామానికి APNGO మద్దతు

ఈనెల 22న ఆదివారం విశాఖపట్నంలో జరగనున్న “సాగర సంగ్రామం” కార్యక్రమానికి APNGO’ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయనగరం ఎన్‌జీవో హోమ్ భవనంలో జిల్లా అధ్యక్షుడు సురేశ్, కార్యదర్శి శ్రీధర్ చేతుల మీదుగా మంగళవారం కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంక్రాంతికి విడుదల చేసిన పెండింగ్ DA ఏరియర్స్ వెంటనే క్రెడిట్ చేయాలని, మెమో 57 అమలు చేయాలని, మెమో 178 ప్రకారం మరణించిన ఉద్యోగుల నామినీలకు 50% చెల్లించాలన్నారు.
News February 17, 2026
VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.


