News January 5, 2026
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హరీశ్‌కు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ DCP రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. గతంలో హరీశ్, రాధాకిషన్‌పై FIR నమోదు కాగా హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. దీంతో ప్రభుత్వం SCని ఆశ్రయించింది. అయితే HC ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని SC తాజాగా స్పష్టం చేసింది.
Similar News
News January 6, 2026
అరవై ఐదేళ్ల వయసులో ఆటో రయ్ రయ్..

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నివసించే మంగళ ఆజీ 65 ఏళ్ల వయసులో చలాకీగా ఆటో నడుపుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పిల్లల చిన్నతనంలోనే భర్త మరణిస్తే కూలి పనులు చేసి పిల్లలను చదివించారు. ఇప్పుడు పిల్లలు స్థిరపడిన తర్వాత మంగళ ఆజీ ఎవరిపై ఆధారపడకుండా ఆటో నడుపుతూ రోజుకు 500-700 వరకు సంపాదిస్తున్నారు. 15రోజుల్లోనే ఆటో నడపడం నేర్చుకున్న ఆమె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News January 6, 2026
EC ఫారం కోళ్లలో గురక వ్యాధికి కారణమేంటి?

EC (ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్) ఫారంలో కోళ్లకు ఎక్కువగా CRD (గురక వ్యాధి) వస్తుంటుంది. దీనికి కారణం ఫారం లోపల అమ్మోనియా వాయువు ఎక్కువగా విడుదలవ్వడం. ఇలా రిలీజైన అమ్మోనియా వాయువును కోళ్లు ఎక్కువగా పీల్చడం వల్ల వాటికి ఈ గురక వ్యాధి వస్తుంది. దీని పరిష్కారంగా EC షెడ్‌కు రెండు వైపులా వాయువులను బయటకు పంపే ఫ్యాన్లను మాన్యువల్ పద్ధతిలో నడిపించాలి. దీని వల్ల అమ్మోనియా బయటకు పోయి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
News January 6, 2026
చెక్ బౌన్స్ సమన్లు.. వాట్సాప్‌లోనూ పంపొచ్చు: ఉత్తరాఖండ్ హైకోర్టు

చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సమన్లపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫిజికల్‌గానే కాకుండా ఇకపై ఈమెయిల్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా సమన్లను పంపవచ్చని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నిందితుడి వ్యక్తిగత ఈమెయిల్, వాట్సాప్ వివరాలను అఫిడవిట్ ద్వారా సమర్పించాలని పేర్కొంది. ఆటోమేటిక్‌గా సమన్లు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.


