News April 16, 2025
ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ తాను ఎక్కడా చెప్పలేదని MLA కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, దాని ఫలితమే ప్రభుత్వంపై ఈ అసంతృప్తి అని ఆయన వివరించారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని, కాంగ్రెస్‌పై వచ్చే వ్యతిరేకత మరో పదిహేను, ఇరవై ఏళ్ల వరకు BRS అధికారంలో ఉండడానికి ఎటువంటి ఢోకా ఉండదని KCR చెప్పిన మాటలను తాను వెల్లడించానన్నారు.
Similar News
News February 19, 2026
హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీ దృష్ట్యా, ఈ 2 స్థానాలూ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే VH నేరుగా అధిష్ఠానానికి లేఖ రాయగా, రాష్ట్ర స్థాయి కీలక నేతలూ ఢిల్లీలోనే ఉండి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నట్లు సమాచారం.
News February 19, 2026
హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి16న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీతో వారి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. VH అధిష్ఠానానికి లేఖ రాయగా, కీలక నేతలూ ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుమార్‌కు అన్యాయం జరిగిందని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నారు.
News February 19, 2026
త్వరలో 2,947 పోస్టుల భర్తీ: మంత్రి రవికుమార్

AP: ఈపీడీసీఎల్ పరిధిలో 2,947 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి రవికుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. 581 ఎనర్జీ అసిస్టెంట్లు, 1,260 జూనియర్ లైన్‌మెన్, 1,084 అసిస్టెంట్ లైన్‌మెన్, 22 లైన్‌మెన్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 8,770 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


