News July 28, 2024
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో కలియ తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల మర్యాదతో మెలిగి మంచి చికిత్స అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు: ఖమ్మం CP

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. పోలీసుల సేవలు, త్యాగాలు, కీర్తి ప్రతిష్ఠలను ప్రతిబింబించే అంశాలపై ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌లను ఈ నెల 22వ తేదీలోపు పీఆర్వో నంబర్ 87126 59256కు పంపాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
News October 15, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్లతో అనుదీప్ దురిశెట్టి సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్ యార్డుల వద్ద డ్రైయర్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న మ్యానువల్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని ఆదేశించారు.
News October 15, 2025
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.