News August 15, 2025
‘ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగుపడాలి’

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వైద్య విధాన పరిషత్‌లో కొనసాగుతున్న జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ గురువారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో సమీక్ష జరిపారు. బోధన్‌లోని జిల్లా ఆసుపత్రితో పాటు ఆర్మూర్, భీంగల్, ధర్పల్లి ఏరియా ఆసుపత్రులు, డిచ్పల్లి, వర్ని, మోర్తాడ్, కమ్మర్పల్లి, నవీపేట్ వైద్యులు వైద్య సేవలందించాలని సూచించారు.
Similar News
News August 14, 2025
TU పరీక్షలు.. మొదటి రోజు 1784 మంది హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ II,IV, సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 1861 మంది విద్యార్థులకు గాను 1784 మంది హాజరు కాగా 77 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన B.ed, B.P.Ed పరీక్షకు 1544 మందికి గాను 1494 మంది విద్యార్థులు హాజరు కాగా 50 మంది గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
News August 14, 2025
NZB: జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నాయని, ఉదయం సగటున 23మి.మీ వర్షపాతం నమోదైందని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మంత్రులు, సీఎస్‌తో వీసీలో మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, అయినప్పటికీ రానున్న 48 గంటల పాటు భారీ వర్ష సూచన దృష్ట్యా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు.
News August 14, 2025
SRSP UPDATE: 45.758 TMCలకు చేరిన నీటిమట్టం

అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మెల్లగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం 45.758 TMCలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 13,910 క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 4,713 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.