News January 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి: ఖమ్మం కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్, దోబీ మిషనరీస్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు.
Similar News
News January 22, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా: సీపీ
ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన కమిటీ ఇటీవల నియామకమైంది. నూతన సభ్యులు ఖమ్మం సీపీ సునీల్ దత్‌ని కమిషనరేట్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారంలో తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
News January 22, 2025
కన్నులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.
News January 22, 2025
KMM: పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ
ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలను సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. కాగా అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.