News October 11, 2024

ప్రభుత్వ జోక్యంతో ధరలు అదుపులోకి వచ్చాయి: మంత్రి కొల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి, టమాటో అందిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. అన్ని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో టమాటో రూ.40, కిలో ఉల్లి రూ.35కి అందజేస్తున్నామని కొల్లు తెలిపారు. అధిక ధరలకు ప్రభుత్వం కూరగాయలు అమ్ముతోందన్న ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వ జోక్యంతో ఉల్లి, టమాటో ధరలు అదుపులోకి వచ్చాయని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

Similar News

News October 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News October 11, 2024

ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు..ప్రజల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరింది.

News October 11, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.